త్రివిక్రమ్ శ్రీనివాస్కు ట్రాఫిక్ పోలీసుల ఫైన్ 

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కారుకు పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ లో తనిఖీలు చేస్తున్న సమయంలో అటువైపుగా వచ్చిన త్రివిక్రమ్ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి, రూ.700 జరిమానా విధించారు. కాగా, గతకొన్ని రోజులుగా బ్లాక్ ఫిల్మ్ ఉన్న కార్లకు పోలీసులు ఫైన్ వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ కార్లకూ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. 

మరిన్ని వార్తల కోసం:

ప్రధాని తప్ప కేబినెట్ అంతా రాజీనామా

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు 

సెలవు రోజుల్లో వీఐపీ దర్శనాలు ఉండవ్