టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతోనే ఆడియన్స్ ని మాయ చేస్తుంటాడు. దీంతో ఇప్పటివరకూ ఇండస్ట్రీలో అత్యధిక సక్సస్ రేట్ ఉన్న దర్శకులలో ఒకరుగా రాణిస్తున్నాడు. అయితే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ కి సమంత కూడా వచ్చింది. దీంతో సమంత ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఇందులో ముఖ్యంగా "ఎప్పుడూ ముంబైలోనే కాకుండా అప్పుడప్పుడూ హైదరాబాద్ కి కూడా రావాలని అన్నారు. దీంతో మీరు నాకోసం స్క్రిప్ట్ రాస్తే కచ్చితంగా వస్తానని సమంత అన్నారు. మీరు నటిస్తానంటే కచ్చితంగా రాస్తామని కానీ మీరు నటించరేమో అని ఇప్పటివరకూ రాయలేదని త్రివిక్రమ్ అన్నాడు. ఇక అత్తారింటికి దారేది చిత్రాన్ని గుర్తు చేస్తూ సమంత కోసం హైదరాబాద్ కి దారేది అంటూ మన తెలుగువాళ్లు హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేద్దామని చెబుతూ సరదాగా అందరినీ నవ్వించాడు.
ఇక చివరగా జిగ్రా చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అలియా భట్ సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైందని అన్నాడు. దీంతో ఈ విజయదశమికి విజయంతో మన ఆడపడుచుని సాగనంపుదామని చెబుతూ జిగ్రా టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా జిగ్రా చిత్రం అక్టోబర్ 11న విజయదశమి కానుకగా విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రానికి వాసన్ బాల దర్శకతం వహించగా రాహుల్ రవీంద్రన్, ఆకాంక్ష రంజాన్, వేదాంగ్ రైనా, ఆదిత్య నంద తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.