ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటాడు. ఈసారి తెలుగు సినిమాపై మోడీ చేసిన కామెంట్స్ గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారాయన. ‘తెలుగు సినిమా గురించి మోడీ పొగిడారని బ్రేక్ డ్యాన్సులు చేయకండి. మోడీ మాట్లాడింది బాహుబలి, పుష్ప సినిమాల గురించే తప్ప.. ఏటా మనం నిర్మించే మిగతా 150 సినిమాల గురించి కాదు. ఒకవేళ ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్లిద్దరూ కన్నడ వాళ్లయితే.. మోడీ శాండల్వుడ్ గురించి మాట్లాడేవారే తప్ప.. టాలీవుడ్ గురించి కాదు’ అంటూ ఆర్జీవీ కామెంట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ గురించి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.
Tollywood doesn’t need to do breakdance ?with champagne? because PM praised ..He was talking only about Bahubali,Pushpa and not the other 150 films we make every year ..if @ssrajamouli and @alluarjun were Kannadigas he would have hailed SANDALWOOD
— Ram Gopal Varma (@RGVzoomin) February 6, 2022
మరిన్ని వార్తల కోసం: