టాలీవుడ్ లో విషాదం నెలకొంది. హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న స్వప్న వర్మ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాజమండ్రికి చెందిన స్వప్న వర్మ మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి సినీ ఇండస్ట్రీలో ఓ నిర్మాతకు అసిస్టెంట్ గా పనిచేస్తుంది. గత సంవత్సరం నుంచి మాదాపూర్ కావూరి హిల్స్ లోని తీగల హౌస్ లో ఒంటరిగా ఉంటుంది. అయితే ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో ఆరు నెలలుగా ఖాళీగా ఉంటున్న స్వప్న వర్మ రెండు రోజుల క్రితం తన ఫ్లాట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
బాడీ డీ కంపోజ్ అయి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. ఘటనా స్థలానికి వచ్చిన మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. అయితే స్వప్న వర్మ ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.