![పృథ్వీ కాంట్రవర్సీ పై స్పందించిన బండ్లన్న... నోటి దూల తగ్గించుకుంటే మంచిదంటూ..](https://static.v6velugu.com/uploads/2025/02/tollywood-film-producer-bandla-ganesh-react-about-laila-movie-controversy_EVZM8LFyR9.jpg)
తెలుగు యంగ్ హీరో నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నటుడు పృథ్వీ పరోక్షంగా వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కాంట్రావర్సీగా మారాయి. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిచినప్పుడు వచ్చామా.. సినిమా గురించి మాట్లాడమా అన్నట్లు ఉండకుండా ఈ మధ్య పృథ్వీ ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లినా సినిమాల గురించి కాకుండా మెయిన్ వైసీపీ పార్టీ గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన ఫలితాల గురించి సెటైర్లు వేస్తూ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ప్రభావం కాస్తా సినిమాల రిజల్ట్స్ పై పడుతోంది.
అయితే లైలా సినిమా ఈవెంట్ లో కూడా మేకలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో కొందరు వైసీపీ ఫ్యాన్స్ ఏకంగా లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి పోస్టులు షేర్ చేస్తూ #BoycottLaila అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. దీంతో లైలా సినిమా మేకర్స్ తలనొప్పిగా మారింది. దెబ్బకి హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు ఈవరో ఒకరు చేసినపని సినిమాని నెగిటివ్ గా ట్రోల్ చేయడం సరికాదని అన్నాడు.
ALSO READ | ఒక్క మాటకు వేల ట్వీట్స్ ఏంటీ.. సినిమా బతకాలా లేదా..? లైలా వివాదంపై విశ్వక్ సేన్
ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులోభాగంగా "రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి. నటించిన వారి నోటి దూలకు సినిమాలకు సమస్య రావడం దారుణం. సినిమా ను సినిమా గా చూడండి.." అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.
దీంతో కొందరు మెగా ఫ్యాన్స్ ఈ స్పందిస్తూ భిన్నంగా లమెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ గారూ గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ సమయంలో స్పందించి ఉంటే ఇప్పుడు లైలా సినిమాకి డ్యామేజ్ జరిగుండేది కాదని అంటున్నారు.
అలాగే పృథ్వీ చేసిన వాఖ్యలకారణంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు గేమ్ ఛేంజర్ కి వ్యతికంగా ట్రోల్ చేశారని, దీనికితోడు కథలో కూడా పెద్దగా పస లేకపోవడంతో గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకయిందని మరికొందరు అంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా నటుడు పృథ్వీ ని సినిమా ఈవెంట్స్ కి రానివ్వకండని లేదంటే దర్శక నిర్మాతలకి చిక్కులు తప్పవని కామెంట్లు చేస్తున్నారు. మరి లైలా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
ఇక ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే ఈ సినిమాలో విశ్వక్ సేన్ కి జంటగా టౌన్గ్ హీరోయిన్ ఆకాంక్ష శర్మ నటించగా సీనియర్ హీరో పృథ్వీరాజ్, వినీత్ కుమార్, అభిమన్యు సింగ్, నరేష్, బ్రహ్మాజీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.
రాజకీయం సినిమా రంగాలు ఒకటిగా చూడకూడదు.
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025
రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేసే నటీ,నటులు సినిమా వేదికలపై రాజకీయాలు చేయకూడదు.
ఇలాంటి వారి విషయం లో నిర్మాతలు జాగ్రత్త వహించాలి.
నటించిన వారి నోటి దూలకు సినిమా లకు సమస్య రావడం దారుణం.
సినిమా ను సినిమా గా చూడండి..
All the best to laila…