హీరో అనే పదానికి టైలర్ మేడ్ లా ఉంటాడు మాచో హీరో గోపీచంద్(Gopichand). ఆ హైట్, ఫిజిక్, కండలు తిరిగిన బాడీ.. ఇలా ఒక మాస్ హీరోకి కావాల్సిన ప్రతీ ఎలిమెంట్ గోపీచంద్ లో కనిపిస్తాయి. అందుకే మాస్ ఆడియన్స్ ఆయన సినిమాల్ని బాగా లైక్ చేస్తారు. అందుకే మరోసారి మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఆయన నుంచి వచ్చిన రీసెంట్ మూవీ భీమా(Bhimaa). ఈ మూవీపై హైప్ చాలా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని టాక్ వినిపించింది.దీంతో గోపీచంద్ మరోసారి బాక్సాఫీస్ రేసులో వెనుకపడిపోయాడు.
కొంతకాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న ఈ హీరోకి హిట్ ఇచ్చే డైరెక్టర్స్ చాలా అంటే చాలా కరువయ్యారు. మరి ప్రస్తుతం గోపీచంద్ ఏ సినిమాలు చేస్తున్నాడో..ఇక ఏది హిట్ అయ్యేలా ఉందో ఒక లుక్కేద్దాం.
కామెడీకి కమర్షియ ల్ టచ్ను జోడించి ఎన్నో సక్సెస్ ఫుల్ మూవీస్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinuvaitla). హీరో గోపీచంద్ తో కామిక్ ఎంటర్ టైనర్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇటీవల సినిమా లొకేషన్స్‌కు సంబంధించి గోపీచంద్ ఓ వీడియోను షేర్ చేశారు. ఎంతో ఇంటెన్సివ్ గా చూపించిన ఈ వీడియో..ఇంట్రెస్టింగ్ లోకేషన్స్ లో సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1పై వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత గోపి మోహన్ కథ అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్(Chaitanya Bharadwaj) మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
కాగా శ్రీను వైట్ల ఆగడు,మిస్టర్,అమర్ అక్బర్ ఆంటోని వంటి మూవీస్ తో భారీ డిజాస్టర్స్ తెచ్చుకున్నారు. దీంతో చాలా కాలం నుంచి మూవీస్ కు దూరంగా ఉంటూ..ఇక ఆయనకు సెట్ అయ్యే జోనర్ లోనే అద్దిరిపోయే కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కలయికలో వస్తోన్న మూవీ కోసం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే..గోపీచంద్ మరో ఇంట్రెస్టింగ్ డైరెక్టర్తో సినిమా షురూ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.జిల్,రాధేశ్యామ్ సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసిన రాధాకృష్ణ(Radhakrishna)తో గోపీచంద్ నెక్స్ట్ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బడా ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ ను విన్న హీరో గోపీ చంద్ కు కథ నచ్చేసిందట. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం డైరెక్టర్ రాధాకృష్ణ రాధేశ్యామ్ డిజాస్టర్ తర్వాత అయన వినిపించిన దాఖలాలు లేవు. ఆ మూవీ ఇచ్చిన ఫలితం వల్ల గట్టి కథను సెట్ చేసే పనిలో ఉన్నాడేమో మరి. రాధేశ్యామ్ ను భారీ స్థాయిలో తెరకెక్కించిన ఎవ్వరికీ పెద్దగా కనెక్ట్ అవ్వాలి. సాంగ్స్, విజువల్స్ తప్ప సినిమా మోస్తరుగా ఆడింది. ఇక ఇప్పుడు గోపీచంద్ తో తీయబోయే సినిమా ఎలా ఉండనుందో అంటూ మాచో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.ఏదేమైనా గోపీచంద్ సాహసం చేయాల్సిందే.