ఒక్క ఫ్రై డే సినిమా హీరోల లైఫ్ మార్చేస్తుంది: కిరణ్ అబ్బవరం

ఒక్క ఫ్రై డే సినిమా హీరోల లైఫ్ మార్చేస్తుంది: కిరణ్ అబ్బవరం

హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అయితే కిరణ్ అబ్బవరం 2019లో రిలీజ్ అయిన రాజావారు రాణీగారు అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.  ఆ తర్వాత అరడజనుకి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. కానీ ఇందులో ఎస్. ఆర్ కళ్యాణ మండపం సినిమా తప్ప మిగిలిన అన్ని చితరహాలు డిజాస్టర్ గా నిలిచాయి. అయితే ఇటీవలే నటుడు కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో ఈ వరుస ఫ్లాప్ ల గురించి స్పందించాడు. 

ఇందులోభాగంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి కెరీర్ ఎలా మారుతుందో అస్సలు ఊహించలేమని అన్నారు. అలాగే ఇండస్ట్రీలో హిట్ దక్కాలంటే అంత సులభం కాదని ఇప్పుడు హిట్లు అందుకున్న హీరోలు ఒకప్పుడు చాలా స్ట్రగుల్స్ పడ్డారని చెప్పుకొచ్చాడు.

ALSO READ | ఆకాశంలో ఎగురుతున్న విమానంలో పొట్టేల్ సినిమా ప్రమోషన్స్..

అయితే ప్రస్తుతం వరుస హిట్లతో ఫామ్ లో తేజ సజ్జ, సిద్దు జొన్నలగడ్డ, తదితరులందరూ ఒకప్పుడు చాలా కష్టపడ్డారని, కానీ హనుమాన్, డీజే టిల్లు చిత్రాలతో ఒక్కసారిగా వీరి దశ మారిందని చెప్పుకొచ్చాడు. వీరిలాగే తనకి కూడా సక్సస్ రావడానికి టైమ్ పడుతుందని అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక్క శుక్రవారం ఎవరి కెరీర్ అయినా మార్చేస్తుందని కాబట్టి ఓపికగా మనం చేయాల్సిన పని చేసుకుంటూవెళితే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని అన్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తెలుగులో "క" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సందీప్ & సుజిత్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత చింత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. ఆమధ్య ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  అయితే ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచ విపథంగా వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.