ఆ స్టార్ హీరో సినిమా కోసం కిరణ్ అబ్బవరం సినిమా రిలీజ్ ఆగిపోయిందా..?

ఆ స్టార్ హీరో సినిమా కోసం కిరణ్ అబ్బవరం సినిమా రిలీజ్ ఆగిపోయిందా..?

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తెలుగులో క అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి నూతన దర్శకులు సుజిత్ & సందీప్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఇక క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే కిరణ్ అబ్బవరం సరసన  తన్వి రామ్, మరియు నయన్ సారిక నటిస్తున్నారు. అచ్యుత్ కుమార్ రేడిన్ కింగ్స్ లీ, అజయ్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. 

అయితే ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఐతే క సినిమా దాదాపుగా 5 భాషలలో తెరకెక్కినప్పటికీ తెలుగులో మాత్రమే అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. మిగిలిన భాషలలో నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. 

ఈ విషయం గురించి హీరో కిరణ్ అబ్బవరం ప్రెస్ మీట్ లో స్పందించాడు. ఇందులో భాగంగా తమిళ్ లో క సినిమా రిలీజ్ కి థియేటర్లు దొరకలేదని అందుకే తమిళ్ లో అనుకున్న డేట్ కి ఈ సినిమా ని రిలీజ్ చేయడం కుదరలేదని తెలిపాడు. 

ALSO READ | శ్రీకాంత్ అయ్యంగార్ వల్గర్ మాటలపై కంప్లయింట్...

ఇక మలయాళంలో క సినిమా డిస్ట్రీబ్యూషన్ హక్కులను ప్రముఖ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కొన్నాడని తెలిపాడు. కానీ అక్టోబర్ 31న దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ కూడా ఉందని ఈ కారణంగా తమ సినిమా రిలీజ్ డేట్ ని మార్చుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. అలాగే క చిత్రానికి సపోర్ట్ అందించాలని మీడియాని కోరాడు.