ప్రభాస్ స్పిరిట్ లో మంచు విష్ణు.. సందీప్ రెడ్డి ఒప్పకుంటాడా.?

ప్రభాస్ స్పిరిట్ లో మంచు విష్ణు.. సందీప్ రెడ్డి ఒప్పకుంటాడా.?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం స్పిరిట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమాకి డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సందీప్ రెడ్డి గతంలో తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అంతేకాదు తన సినిమాలలో హీరోని చూపించే విధానం,డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇలా అన్నీ పవర్ ఫుల్ గా ఉంటాయి. 

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు ఖమని అంటున్నారు. అయితే స్పిరిట్ సినిమాలో నటీనటుల కోసం తన అనుంబంధ ప్రొడక్షన్ సంస్థ అయిన భద్రకాళీ పిక్చర్స్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో నటీనటులు కావాలని ఎక్స్ లో షేర్ చేశాడు. ఈ క్యాస్టింగ్ కాల్ కి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. నూతన నటీనటులే కాదు... సినీ సెలెబ్రెటీలు కూడా ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్ కోసం అప్లికేషన్ పెడుతున్నారు.

టాలీవుడ్ ప్రముఖ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ "మంచు విష్ణు" స్పిరిట్ సినిమాలో ఆడిషన్ కోసం అప్లై చేసుకున్నాడు. ఈ విషయాన్ని విష్ణు తన అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అంతేకాదు క్యాస్టింగ్ కాల్ కోసం భద్రఖాళీ పిక్చర్స్ షేర్ చేసిన పోస్టర్ ని కూడా షేర్ చేశాడు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అలాగే సందీప్ రెడ్డి మంచు విష్ణు ని స్పిరిట్ సినిమాకి తీసుకుంటాడో లేదో అనే విషయంపై అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి.

ప్రభాస్ స్పిరిట్ లో పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉండటంతో సందీప్ రెడ్డి సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేసాడు. అంతేకాదు మ్యూజిక్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయినట్లు సమాచారం. ఐతే స్పిరిట్ సినిమా షూటింగ్ జులై నెలలో ప్రారంభం కానుంది. దీంతో సినిమాలోని నటీనటుల కోసం సందీప్ రెడ్డి వెతుకులాట మొదలు పెట్టాడు.