ప్రతిష్టాత్మక పారాలింపిక్స్ లో కాంస్య పథకంతో చరిత్ర సృష్టించిన అథ్లెట్ దీప్తి ప్రతిభను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. రాష్ట్ర యువ అథ్లెట్ జీవాంజి దీప్తి ప్రతిభకు తగిన గుర్తింపు లభించిందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
పారాలింపిక్స్ లో పథకం సాధించిన సందర్భంగా దీప్తికి సన్మాన కార్యక్రమం భారత బాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అధ్యక్షతన జరిగింది. సోమవారం (30 డిసెంబర్ 2024) పుల్లెల గోపీచంద్ బ్యాట్మెంటన్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా దీప్తి ప్రతిభ ట్యాలెంట్ ను కొనియాడారు. ఎంతో మంది యువ క్రీడాకారులకు దీప్తి ప్రతిభ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
ALSO READ | రోహిత్కు బ్యాడ్ టైమే గానీ.. బుమ్రాకు లక్కు బానే కలిసొచ్చింది.. అవార్డుకు నామినేట్ అయ్యాడు