శ్యామ్ మరణం మనసును కలిచివేసింది : ఎన్టీఆర్

తన వీరాభిమాని శ్యామ్ మరణంపై టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ స్పందించారు. శ్యామ్ మరణం తనని కలచివేసిందని తెలిపారు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. "శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతని తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచివేసింది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తూ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ రాసుకొచ్చారు ఎన్టీఆర్. 

ALSO READ:బిగ్బాస్ కొత్త సీజన్ కోసం కమల్ భారీ రెమ్యునరేషన్
 
ఇక జూన్ 25న ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త శ్యామ్ కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ ను, ఆయన అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసింది. అయితే శ్యామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. శ్యామ్ ఆతహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో కావాలనే ఇదంతా చేశారని ఆరోపిస్తున్నారు. అందుకే ఎన్టీఆర్ కూడా తన లెటర్ లో శ్యామ్ మరణానికి గల కారణాలను తెలుసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరారు.