ZEBRA Review: జీబ్రా రివ్యూ.. సాలిడ్ కాన్సెప్ట్తో వచ్చిన సత్యదేవ్.. మూవీ ఎలా ఉందంటే?

ZEBRA Review: జీబ్రా రివ్యూ.. సాలిడ్ కాన్సెప్ట్తో వచ్చిన సత్యదేవ్.. మూవీ ఎలా ఉందంటే?

కొత్త తరహా కాన్సెప్టులు, డిఫరెంట్ రోల్స్‌‌తో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న సత్యదేవ్ (SatyaDev) ‘జీబ్రా’(Zebra) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కన్నడ ఫేమ్ ధనుంజయ్, ప్రియా భవానీ శంకర్ కీ రోల్లో నటించిన జీబ్రా మూవీ.. ఇవాళ శుక్రవారం (నవంబర్ 22న) థియేటర్స్లో రిలీజయింది.

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఎన్ రెడ్డి, ఎస్. పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఆర్థిక నేరాల నేపథ్యంలో తెరకెక్కిన జీబ్రా మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్లో రిలేషన్ షిప్ మ్యానేజర్గా వర్క్ చేస్తుంటాడు సూర్య (సత్యదేవ్). బ్యాంకులో సాధారణ జీతానికి పనిచేసే ఓ మిడిల్ క్లాస్ ఉద్యోగి. వేరే బ్యాంకులో ఉద్యోగం చేసే స్వాతి (ప్రియ భవానీ శంకర్)ని హీరో సత్య ప్రేమిస్తాడు. అలా సాఫీగా సాగుతోన్న వీరి లైఫ్ అనుకోకుండా చిక్కుల్లో పడుతోంది. ఓ రోజు స్వాతి 4 లక్షల రూపాయలను తప్పుడు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తోంది. దాంతో తన లైఫ్ రిస్క్లో పడుతోంది. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా ఈ చిక్కుల్లోంచి బయటపడేయాలని సూర్య ముందుకొస్తాడు.

అప్పటికే ఆ డబ్బులు పడిన వ్యక్తి వాటిని తన అవసరాలకు వాడేసుకుంటాడు. ఇక చేసేదేం లేక బ్యాంకింగ్ సిస్టమ్‌లో కొన్ని బొక్కలను వాడి.. స్వాతిని ఫ్రాడ్ ఇష్యూ నుండి బయటపడేసే క్రమంలో.. సూర్య 5 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్లో ఇరుక్కుంటాడు. అయితే ఈ వ్యవహరంలో గ్యాంగ్ స్టర్ ఆది (ధనంజయ్)కి లింక్ ఉందనే విషయం తెలుసుకుంటాడు.

ఇక ఈ వ్యవహారమంతా కావాలనే ఆది చేస్తాడా? లేక ఎవరైనా కావాలనే ఇరిక్కించారా ? చివరికి ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్లింది? చివరివరకూ ఎవరు మంచి ఎవరు చెడు? ఈ ఫ్రాడ్ ఇస్స్యూ నుండి సత్య, స్వాతి బయటపడ్డారా? లేదా అనేది జీబ్రా మూవీని థియేటర్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే. 

ఎలా ఉందంటే::

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా,ఆర్థిక నేరాల నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌‌‌గా జీబ్రా మూవీని తెరకెక్కించారు. బ్లాక్ మనీ, వైట్ మనీ చుట్టూ జరిగే కథ ఇది. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ గతంలో బ్యాంక్‌లో పని చేశారు. ఆయన చూసిన ఇన్సిడెంట్స్‌తో పాటు ఇంకొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌తో ఈ కథని రాసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇటీవలే బ్యాంకింగ్ నేపథ్యంలో వచ్చిన లక్కీ భాస్కర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. అయితే, లక్కీ భాస్కర్ పూర్తిగా పీరియాడిక్ జోనర్ లో వచ్చిన కథ. జీబ్రా కాంటెంపరరీ స్టొరీ. దేనికదే డిఫరెంట్ స్టోరీ. 

ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ అనేది పూర్తిగా డిజిటల్ అయింది. అంటే, ఎలాంటి క్రైమ్ అయిన బయట వ్యక్తులు చేసే అవకాశం చాలా తక్కువ. బ్యాంకులో పని చేసే వాళ్లకి తప్పితే కామన్ పీపుల్ కి అక్కడ జరిగే మిస్టేక్స్ తెలీవు. అయితే, ఈ విషయంలో డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసిన అనుభవాన్ని ప్రేక్షకుల అర్ధమయ్యే శైలిలో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు.

ALSO READ : Theatre Releases: క్రిస్మస్కు తెలుగు సినిమాల పండుగ.. 

ఫస్టాఫ్‌లో ఇంట్రెస్టింగ్‌గా కథను మొదలెట్టిన డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్.. ఇంటర్వెల్ లో ఇచ్చే ట్విస్ట్ తో సెకండాఫ్‌ పై క్యూరియాసిటీ పెంచుతోంది. డాలీ & సత్యదేవ్ ఫస్ట్ మీట్ ను కంపోజ్ చేసిన విధానం మంచి మాస్ కిక్ ఇస్తుంది. అయితే, బ్యాంకుల్లో జరిగే చాలా లోపాలను ఆసక్తిగా అంటే.. ఇంకాస్తా లోతుగా చూపించే ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలిగిస్తోంది. అలాగే చివరివరకూ ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలీదు. ప్రతిఒక్కరిలో గ్రే  ఉంటుంది. ఏటీఎంలో డబ్బులు తీసినప్పుడు ఓ సౌండ్ వస్తుంది కదా.. ఆ సౌండ్ వెనుక జరిగేదే జీబ్రా అని మేకర్స్ చెప్పిందే నిజమయ్యేలా కథ, స్క్రీన్ ప్లే సాగింది.

ఎవరెలా చేశారంటే::

సూర్య పాత్రలో సత్యదేవ్ మరోసారి పవర్ ఫుల్ రోల్ లో కనిపించాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్, డైలాగ్స్ తనదైన శైలిలో నటించి ఇరగదీశాడు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో కన్నడ ఫేమ్ ధనుంజయ్ మెప్పించాడు. పుష్పలో జాలీ రెడ్డి పాత్ర తనకి ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో.. ఈ సినిమాతో అది మరింత రెట్టింపు అయ్యేలా నటించాడు. ప్రియా భవాని శంకర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సత్యరాజ్, సునీల్ గుర్తుండిపోయే పాత్రలలో నటించి మెప్పించారు.

సాంకేతిక అంశాలు::

‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్‌‌ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలం. సత్యదేవ్ డైలాగ్స్ విషయంలో మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ చూపించింది. ఓవరాల్ గా జీబ్రా మూవీకి రవి బస్రూర్‌‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ఎడిటింగ్ ఈ సినిమాకి మరో బలం. డైరెక్టర్ ఈశ్వర్ కార్తిక్ ఫస్ట్ మూవీ పెంగ్విన్ తో నేర్చుకున్న పాఠాలను.. ఎలాంటి తప్పులు జరగకుండా జీబ్రా సినిమాని తెరకెక్కించాడు. రాసుకున్న కథకు తనదైన స్క్రీన్ ప్లే తో వచ్చి సక్సెస్ అయ్యాడు.