వేములవాడ రాజన్న సన్నిధిలో హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు.

వేములవాడ రాజన్న సన్నిధిలో హీరో శ్రీకాంత్ ప్రత్యేక పూజలు.

టాలీవుడ్ ప్రముఖ హీరో శ్రీకాంత్ ఈరోజు (ఆదివారం) రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందులోభాగంగా  స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులనుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తర్వాత  ఆలయ అధికారులు ఆశీర్వచన మండపంలో శ్రీకాంత్ కి స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మీడియాతో మాట్లుడుతూ కార్తీకమాసంలో ఉపవాసాలు ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారిని దర్శించుకున్నానని తెలిపాడు. మొదటిసారిగా రాజన్న స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే తన సినిమాల గురించి మాట్లాడుతూ తాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన  గేమ్ చేంజర్ సినిమాలో కీలకపాత్రలో నటించానని తెలిపాడు. ఈ సినిమా సంక్రాంతి పండగకి జనవరి 10న రిలీజ్ అవుతోందని చెప్పుకొచ్చాడు. 

ప్రస్తుతం కళ్యాణ్ రామ్, సాయి దుర్గ తేజ్, తదితర హీరోల సినిమాల్లో నటిస్తున్నానని తెలిపాడు. అలాగే తాను సోలో హీరోగా మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపాడు. ఇక తన కుమారుడు రోషన్ గురించి మాట్లాడుతూ ఛాంపియన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడని తెలిపాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత స్వప్న దత్ నిర్మిస్తోంది.