అన్‌స్టాపబుల్‌ షోలో వెంకీ మామతో సందడి చెయ్యనున్న బాలయ్య..

అన్‌స్టాపబుల్‌ షోలో వెంకీ మామతో సందడి చెయ్యనున్న బాలయ్య..

బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న‘అన్‌స్టాపబుల్‌ విత్  ఎన్బీకే ’ అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే మొదలైన 4వ సీజన్లో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, లక్కీ భాస్కర్ మూవీ టీమ్, కంగువ సూర్య, పుష్ప 2 అల్లు అర్జున్ తదితరులు వచ్చి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు. దీంతో ఈసారి నిర్వాహకులు "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ టీమ్ తో సందడి చేసేందుకు సిద్దమవుతన్నారు. 

ఈ క్రమంలో హీరో విక్టరీ వెంకటేష్ అన్‌స్టాపబుల్‌ షోకి గెస్ట్ గా వచ్చి ఆడియన్స్ ని అలరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఆదివారం (డిసెంబర్ 22) ఈ ఎపిసోడ్ కి సంబందించిన షూటింగ్ మొదలు పెట్టి ఒకేరోజులో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు షో నిర్వాహకులు.

ఈ విషయానికి సంబందించిన పోస్టర్స్ కూడా ఇప్పటికే మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే "నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వెంకీమామ బాలయ్య ఒకే స్టేజ్ మీద. ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ కి రెడీ అవ్వండమ్మా" అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇప్పటివరకూ వెంకటేష్ టాక్ షోలలో పాల్గొనలేదు. మొదటిసారి బాలయ్య టాక్ షోకి గెస్ట్ గా వస్తున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం ఇలా ఉండగా వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తన్నాం, బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాలు రెండు రోజుల గ్యాప్ తో జనవరిలో సంక్రాంతిబరిలో దిగనున్నాయి. దీంతో ఈ సినిమాలకు సంబందించిన విషయాలు అన్‌స్టాపబుల్‌లో చర్చించే అవకాశం ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ahavideoin (@ahavideoin)