టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు.ఇటీవలే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ఆకట్టుకోగా మరో రెండో సినిమాలను లైన్ లో పెట్టేసాడు.అందులో ఒకటి మెకానిక్ రాకీ (Mechanic Rocky) కాగా.. రెండోవది లైలా(Laila).విశ్వక్ కెరీర్ లో మొదటిసారి ఈ సినిమా కోసం లేడీ రోల్లో కనిపించనున్నాడు.
తాజాగా విశ్వక్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ఇందులో ఆయన పోలీస్‌గా కనిపించనున్నారు.ఈ సినిమా విశ్వక్ కెరీర్లో13వ సినిమాగా రానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.శ్రీధర్ గంట దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో ఖాకి డ్రెస్ ధరించి, గన్ ను చూపిస్తూ, ముఖం కనిపించకుండా వెనక నుండి విశ్వక్ ను డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అలాగే ఈ పోస్టర్ లో ప్రతి చర్యకు నిప్పులాంటి ప్రతిచర్య ఉంటుందని పోస్టర్ పై క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ పోస్టర్ ను బట్టి పవర్ ఫుల్ పోలీస్ కథా నేపథ్యం ఉన్న సినిమాగా ఉండే అవకాశం ఉంది. SLV బ్యానర్ లో 8వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
A High Voltage Action Film 🧨🧨🪓🪓
— VishwakSen (@VishwakSenActor) August 6, 2024
Written and directed by #SreedharGanta@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop @SLVCinemasOffl pic.twitter.com/lZbwFPlWH2