Balakrishna Bro: బాలయ్య బ్రోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తా: విశ్వక్ సేన్

Balakrishna Bro: బాలయ్య బ్రోతో  మల్టీ స్టారర్ సినిమా చేస్తా: విశ్వక్ సేన్

Balakrishna Bro: టాలీవుడ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ కి మరో లెజెండరీ హీరో నందమూరి బాలకృష్ణతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. గతంలో హీరో విశ్వక్ సేన్ బాలకృష్ణ తో కలసి అన్ స్టాపబుల్ షోలో కూడా సందడి చేశాడు. అంతేకాదు పలు ప్రైవేట్ పార్టీలలో కలసి చిల్ అవుతుంటారు వీరిద్దరూ. దీంతో వీరి కాంబినేషన్ లో సినిమాని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ విషయంపై హీరో విశ్వక్ లైలా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్వూలో పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

తనకి బాలకృష్ణతో మంచి సాన్నిహిత్యం ఉందని అలాగే తాను బాలయ్యను బ్రో అని పిలుస్తానని తెలిపాడు. అలాగే సార్, బాలయ్య గారు అని పిలవడం బాలకృష్ణకి ఇష్టం ఉండదని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణతో కలసి మల్టీస్టారర్ సినిమా చేయ్యాలని ఉందని దీంతో స్టోరీ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని సరైన స్టోరీ దొరికితే డెఫినెట్ గా బ్రోతో కలసి సినిమా చేస్తానని స్పష్టం చేశాడు. 

అయితే బాలకృష్ణ కి పద్మ విభూషణ్ అవార్డు వచ్చినప్పుడు 10 నిమిషాలలోపే కంగ్రాచులేషన్ చెబుతూ విష్ చేసానని కానీ అవార్డు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి మాత్రం వెళ్లలేదని చెప్పుకొచ్చాడు. దీంతో విశ్వక్ - నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతన్నారు. బాలయ్య మాస్ ఇమేజ్ కి, విశ్వక్ స్వాగ్ కాంబినేషన్ లో సినిమా పడితే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా విశ్వక్ నటించిన లైలా సినిమా వాలైంటేన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా నటించాడు.