Viral Video: డాకు మహారాజ్‌ సెలబ్రేషన్స్.. ముద్దులతో ముంచెత్తిన బాలయ్య

బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మాస్ ఆడియన్స్ తో పాటు హీరోస్ సైతం సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ సినిమా సక్సెస్ పై ఫుల్ ఖుషి అవుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. బాలకృష్ణకు విషెస్‌ తెలియజేస్తూ విశ్వక్‌, సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్‌ వీడియో రిలీజ్ చేయడంతో ఇపుడు వైరల్ అవుతుంది. 

జనవరి 12 ఆదివారం రాత్రి మేకర్స్ గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఇందులో సినిమా టీమ్‌తోపాటు బాలయ్య సన్నిహితులు, యంగ్‌ హీరోలు కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా విశ్వక్‌ సేన్‌, సిద్దు జొన్నలగడ్డలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొని పార్టీ చేసుకుంటూ సందడి చేశారు. వీరిద్దరూ బాలయ్యతో కలిసి సెల్ఫీ వీడియోలు తీసుకుని ఫుల్ ఖుషి అయ్యారు.

" కంగ్రాట్యులేషన్స్ డాకు మహారాజ్.. అంటూ విశ్వక్ అనగా.. హలో మై డార్లింగ్ లైలా.. అంటూ బాలయ్య ముద్దుపెట్టేశాడు. నా సక్సెసే మీ సక్సెస్‌ అని, ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్‌ అని బాలయ్య అనేశాడు. మధ్యలో సిద్దు కల్పించుకుని.. ముద్దు నాకేది బ్రో.. అనగానే మరో ముద్దుతో ముంచెత్తాడు బాలయ్య.. " దీంతో వీడియో ఆగేదే లేకుండా వైరల్ అవుతుంది.