నటనపై ఆసక్తి కారణంగా తమ ప్రొఫెషన్స్ ని వదిలి ఇండస్ట్రీకి వచ్చి ఆఫర్లని దక్కించుకుని టాలెంట్ ప్రూవ్ చేసుకున్నవారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. తెలుగులో ప్రముఖ హీరో ప్రియదర్శి హీరోగా నటించిన మిర్ మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పవచ్చు.
అయితే అనన్య ప్రస్తుతం తెలుగులో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్న అనన్య తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఆడియన్స్ తో పంచుకుంది.
ఇందులోభాగంగా నటి కావాలనే కోరికతో తన ఇంట్లోవాళ్ళతో చెప్పకుండా ఇన్ఫోసిస్ లో ఉద్యోగం మానేసి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపింది. ఈ క్రమంలో MR.మల్లేశం సినిమాలో ఆఫర్ వచ్చినప్పటికీ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇంట్లోవాళ్ళకి చెప్పాలని అనుకున్నానని కానీ అప్పటికే ఇతరుల ద్వారా తానూ సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిసి తిట్టారని చెప్పుకొచ్చింది.
ALSO READ | హిందీలో చరిత్ర సృష్టించిన పుష్ప 2.. తెలుగులో బాహుబలి రికార్డులపై కన్ను..
తాను ఇండస్ట్రీకి వచ్చినందుకు కొంతమంది నీ పెంపకం బాగాలేదని అందుకే అనన్య సినిమాల్లోకి వెళ్ళిందంటూ సూటిపోటి మాటలతో తన తల్లిని ఇబ్బంది పెట్టారని దాంతో తనకి చాలా బాధ కలిగిందని ఎమోషనల్ అయ్యింది. అలాగే తన తల్లిని అన్న మాటలకి తనలో మరింత కసి పెరిగిందని దీంతో డెఫినెట్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనే పట్టుదల పెరిగి ఆఫర్ల కోసం కష్టపడ్డానని తెలిపింది. కచ్చితంగా మంచి సినిమాలు చేసి మంచి పొజిషన్ కి వెళ్లాలని నిర్ణయించుకుని వరుస ఆఫర్లు దక్కించుకుంటూ రాణిస్తున్నానని తెలిపింది.
ఈ విషయం ఇలా ఉండగా గత నెల అనన్య నాగళ్ళ నటించిన పొట్టెల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఓటిటిలో ఇటీవలే రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.