టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిహారిక కొణిదెల తమిళ్ లో మద్రాస్కారన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తమిళ్ డైరెక్టర్ వాలీ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులోభాగంగా నిహారిక ఓ ప్రమోషన్ ఇంటర్వూలో పాల్గొని సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ గురించి స్పందించింది.
ఇందులోభాగంగా సంధ్య థియేటర్ ఘటన కారణంగా అల్లు అర్జున్ చాలా బాధ పడుతున్నాడని, డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని తెలిపింది. అలాగే ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యుల సహకారంతో కోలుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. అలాగే ఎవరూ కూడా ఇలాంటి ఘటనలు జరగాలని కోరుకోరు.. బన్నీ ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో మహిళ మృతి చెందడం దురదృష్టకరమని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ALSO READ | Honey Rose: స్టార్ హీరోయిన్ ని ఇబ్బంది పెడుతున్న బిజినెస్ మెన్ అరెస్ట్...
ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది డిసెంబర్ 4న (బుధవారం) రాత్రి తెలంగాణలో 9:30 గంటల షోస్ కి పర్మిషన్ ఉండడంతో భాస్కర్ అనే వ్యక్తి తన భార్య రేవతి, కొడుకు శ్రీ తేజతో కలసి హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి వచ్చాడు. ఇదే థియేటర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావడంతో ఒకసారిగా అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట జరగడంతో రేవతి అక్కడిక్కడే మృతి చెందింది. అలాగే బాలుడి శ్రీ తేజ కూడా తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. దీంతో బాలుడిని దగ్గరిలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతన్నాడు.