టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రికి క్యాన్సర్.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ...

టాలీవుడ్ లో RX100, మంగళవారం, వెంకీమమ  సినిమాల్లో హీరోయిన్ గా నటించి తెలుగు ఆడియన్స్ ని భాగమే మెప్పించింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. అయితే నటి పాయల్ రాజ్ పుత్ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో పాయల్ షేర్ చేసిన స్టోరీ ఫ్యాన్స్ ని ఆందోళనకి గురి చేస్తోంది.

ఐతే మంగళవారం (ఏప్రిల్ 8) పాయల్ రాజ్‌పుత్ తండ్రికి క్యాన్సర్ భారిన పడినట్లు తెలిపింది. ఇందులోభాగంగా హాస్పిటల్ లో తన తండ్రి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫోటోలని కూడా షేర్ చేసింది. తన తండ్రి అన్నవాహిక క్యాన్సర్ బారిన పడ్డాడని దీంతో కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. 

Also Read:-ఓజీలో డీజే టిల్లు బ్యూటీ స్పెషల్ సాంగ్.. నిజమేనా ..?

ఈ క్లిష్ట సమయంలో తనకి అండగా నిల్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. అయితే తన తండ్రి హాస్పిటల్ లో ఉన్నప్పటికీ తనని మాత్రం రెగ్యులర్ గా షూటింగ్స్ కి వెళుతూ తనపని తాను చేసుకోవాలని సూచించాడని అటువంటి తండ్రి దొరకడం నిజంగా గ్రేట్ అంటూ పేర్కొంది. దీంతో పాయల్ రాజ్ పుత్ తండ్రి త్వరగా క్యాన్సర్ బారిన నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా టాలీవుడ్ ప్రముఖ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న "కిరాతక" అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి నూతన దర్శకుడు ఎం. వీరభద్రం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే సైనా ఈ సినిమా రిలీజ్ అప్డేట్ రానుంది..