కిస్ సీన్స్ కూడా చేస్తా.. కానీ అది డిమాండ్ చేస్తేనే అంటున్న రీతూ వర్మ..

కిస్ సీన్స్ కూడా చేస్తా.. కానీ అది డిమాండ్ చేస్తేనే అంటున్న రీతూ వర్మ..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రీతూ వర్మ విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన "పెళ్లి చూపులు" సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో స్టార్ హీరోయిన్ గా  పెద్దగా గుర్తింపు లభించలేదు. అయితే ఈ అమ్మడు లేటెస్ట్ గా హీరోయిన్ గా నటించిన చిత్రం "మజాకా". ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా నటి రీతూ వర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

మజాకా సినిమా కోసం మొత్తం చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారని దీంతో మంచి అవుట్ ఫుట్ వచ్చిందని తెలిపింది. అలాగే ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటివరకూ తన సినిమాల్లో కిస్ సీన్స్ చేయలేదని కానీ స్టోరీ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చింది. కొంతమంది దర్శకనిర్మాతలు హీరోయిన్స్ ని బట్టి ఫలానా పాత్రయితే సూటవుతుందని ముందే నిర్ణయానికి వచ్చేస్తారని దీంతో తనవద్దకు బోల్డ్ రిలేటెడ్ పాత్రలు, కథలు రావడం లేదని తెలిపింది. కానీ తనకి కూడా ఇలాంటి పాత్రలు చెయ్యాలని ఉందని మనసులోని మాట బయట పెట్టింది. 

ఈ విషయం ఇలా ఉండగా మజాకా సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించగా సినీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మించాడు. రావు రమేష్, వెటరన్ హీరోయిన్ అన్షు అంబానీ, సుప్రీత్, అజయ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.  ఈరోజు మజాకా సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.