టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య ఇంటర్వ్యూలు, ఫోటోషూట్లు అంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో ఇటీవల సమంత ఓ ఇంటర్వూలో పాల్గొని తన పాస్ట్ లైఫ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఇంటర్వూ చేసే యాంకర్.. మీ మాజీ ప్రియుడు మిమ్మల్ని కాదని వేరొకరితో రిలేషన్ షిప్ లోకి వెళ్ళినప్పుడు మీరు అసూయ పడ్డారా..? అని అడిగారు.
దీంతో సమంత చాలా కూల్ గ సమాధానం ఇచ్చింది. ఇందులో భాగంగా తన మనసులో అసూయకి అస్సలు స్థానం లేదని తెలిపింది. అలాగే అన్ని చెడు పనులకి అసూయ ముఖ్య కారణమని దాంతో తాను అసూయకి దూరంగా ఉంటూ తన మనసులో చోటు ఇవ్వనని స్పష్టం చేసింది. అలాగే అసూయ, ద్వేషం వంటివి హ్యూమన్ రిలేషన్స్ ని దెబ్బతీస్తాయని కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక తన దీంతో సమంత చెప్పిన ఈ ఆన్సర్ విని యాంకర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
అయితే ఈ ఇంటర్వూలో సమంత సిటాడెల్: పికిల్ బాల్ టోర్నమెంట్ లో హనీ బన్నీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడిదంని, డేటింగ్ కూడా చేస్తున్నారని వినిపిస్తున్న వార్తలపై స్పందిస్తుందని అనుకున్నపటికీ ఎలాంటి కామెంట్లు చెయ్యలేదు.
ఈ విషయం ఇలా ఉండగా నటి సమంత టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ 5 ఏళ్లపాటు కలసి ఉన్నారు. కానీ అనుకోని కారణాలవల్ల పరస్పర అంగీకారంతో 2021వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. సమంత మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోలేదు.