ప్రీతమ్ జుకల్కర్‌కు..సమంత స్పెషల్ గిఫ్ట్..ఎంత మురిసిపోయాడో

టాలీవుడ్ బ్యూటీ సమంత(Samantha) వరుస సినిమాలతో కంటే, సోషల్ మీడియా పోస్ట్ లతో వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ ఖుషీ మూవీతో పలకరించి..యావరేజ్ హిట్ సొంతం చేసుకుంది సమంత.

లేటెస్ట్గా సమంత, తన స్టైలిష్ట్‌ ప్రీతమ్ జుకల్కర్‌(Preetham Jukalker)కు మధ్య సాగిన ఇన్స్టా స్టోరీ వైరల్ అవుతుంది. ప్రీతమ్ తన చెవులను కుట్టించుకున్నట్లు..తన ఇన్ స్టా స్టోరీలో ఫొటోస్, వీడియోస్ను షేర్ చేశారు. అంతేకాకుండా సమంత దగ్గరుండి మరీ..ఈ చెవి రింగులు కుట్టించినట్టు తెలుస్తోంది. ఈ చెవి రింగులను సమంత గిఫ్టుగా ఇచ్చిందన్న న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

ప్రీతమ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ..ఒక చెవికి కుట్టిద్దామని వెళ్తే..రెండు చెవులకు రింగులు కుట్టించేశారని..అంతగా నొప్పి పుట్టలేదని ప్రీతమ్ తెలుపగా..అవునా? అంటూ రింగ్ కుట్టించుకునే టైంలో ప్రీతమ్ భయపడ్డ వీడియోను సమంత షేర్ చేసింది. దీంతో  వీరిద్దరి ఇన్స్టా ముచ్చట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సమంత, ప్రీతమ్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అప్పట్లో..సోషల్ మీడియాలో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. సమంత.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న టైంలో..వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు వార్తలు రాగా..అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని తెలిసింది. ఈ రూమర్ల మీద ప్రీతమ్ మనస్థాపం చెంది..అప్పట్లో సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ కూడా అయ్యారు. సమంతను తాను అక్క అని పిలుస్తానని, ఆ విషయం  చైతన్యకి కూడా తెలుసంటూ ప్రీతమ్ బాధపడిన విషయం తెలిసిందే. ప్రీతమ్ లేటెస్ట్ పోస్ట్ లో కూడా థ్యాంక్యూ సమంత దీదీ అని ఉండటంతో మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ALSO READ: గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్..శంకర్ లేటెస్ట్ ట్వీట్ వైరల్

ఇక సమంత తన లేటెస్ట్ లైఫ్ లోకి ఇప్పుడిప్పుడే అడుగులేస్తోంది. రీసెంట్గా సమంత మళ్లీ తన గ్యాంగ్‌తో కలిస్తోంది. మొన్నటికి మొన్న సింగర్ చిన్మయి ఇంటికి వెళ్లి అక్కడ వారి పిల్లలతో కలిసి ఆడుకున్న ఫొటోస్ కూడా షేర్ చేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ప్రీతమ్ కు చెవి రింగులు కుట్టించింది. ప్రీతం కూడా మళ్లీ సమంతకు స్పెషల్ డ్రెస్సులు డిజైన్ చేస్తున్నట్లు ఇన్ స్టా లో పేర్కోన్నారు.  

ఇక సమంత మూవీస్ విషయానికి వస్తే..రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో వస్తోన్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇక సమంత త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ విన్పిస్తోంది.ఈ మూవీలో హీరోగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించనుందని తెలుస్తోంది. కరణ్ జోహార్ ప్రొడ్యూసర్ గా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై..పవన్ కళ్యాణ్ పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ ఈ మూవీని తెరకెక్కించినట్లు సమాచారం.