Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్పై సంతకం

Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్పై సంతకం

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha)ఇవాళ (ఏప్రిల్ 19న ) తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నేడు తిరుమల చేరుకున్న ఆమెకు టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఆమె క్రిష్టియన్ కావడంతో టీటీడీ డిక్లరేషన్పై సంతకం చేశారు. అనంతరం సమంత స్వామివారి సేవలో పాల్గొని  మొక్కులు చెల్లించుకుంది. ఆ తర్వాత సమంత స్వామివారికి షాష్టాంగ నమస్కారం చేసింది. 

సౌత్ బ్యూటీగా సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఇష్టపడే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కొంతకాలం వరకు అనారోగ్య సమస్యలతో బాధపడిన ఆమె..ఈమధ్యే కోలుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటించడానికి రెడీ అయింది.

అంతేకాకుండా తన సొంత ట్రాలాలా బ్యానర్ లో వరుస సినిమాలో నిర్మిస్తోంది. ఫస్ట్ మూవీగా ‘శుభం’ సినిమాను నిర్మిస్తోంది. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ‘సినిమా బండి’ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దీనికి దర్శకుడు. వసంత్ మరిగంటి కథను అందించాడు. ఈ మూవీ మే 9న రిలీజ్ కానుంది.