తెలుగు సినిమా పరిశ్రమ(Telugu film industry) కీలక ప్రకటన చేసింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు(Ramoji rao) మృతికి సంతాపంగా రేపు(జూన్ 9) సినిమాల షూటింగ్స్ కు సెలవు ప్రకటించారు. ఈమేరకు చలనచిత్ర నిర్మాతల మండలి పిలుపునిచ్చింది. రామోజీరావు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు.
ఇక రామోజీరావు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో ఆయన్ని హాస్పిటల్ కి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో భారతీయ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.