The Trial Movie: ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

The Trial Movie:  ఓటీటీకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యుగ్‌ రామ్, వంశీ కోటు, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ ఇంటరాగేటివ్‌ థ్రిల్లర్‌ 'ది ట్రయల్'(The Trial ). రామ్‌ గన్నీ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఎస్‌ఎస్‌ ఫిల్మ్స్, కామన్‌ మేన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై స్మృతి సాగి, శ్రీనివాస్‌ కె. నాయుడు నిర్మించారు. 

లేడీ ఓరియంటెడ్‌ కథతో రూపొందించిన ఈ మూవీ లేటెస్ట్గా ఓటీటీకి వచ్చేసింది. గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చిన  ఈ మూవీ..ఆడియన్స్ను అంతలా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ది ట్రయల్ మూవీ తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో  స్ట్రీమింగ్‍కు‍ అవుతోంది. ఈ లేటెస్ట్ క్రైమ్ ఇంటరాగేటివ్‌ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూడనివారు..ఎంచక్కా  ఓటీటీలో చూసి థ్రిల్ అవ్వండి. ఈ మూవీకి శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు.

ది ట్రయల్ స్టోరీ విషయానికి వస్తే.. 

పోలీస్ ఆఫీసర్ రూప (స్పందన) మ్యారేజ్ అయ్యాక వారి తొలి వార్షికోత్సవం రోజున ఆమె భర్త అజయ్ (యుగ్ రామ్) ఓ బిల్డింగ్‍పై నుంచి కింద పడి చనిపోతాడు. అయితే, అజయ్ ఫ్యామిలీకి రూపపై అనుమానం కలుగుతోంది.దీంతో అక్కడ ఉన్న వారందరూ కూడా అజయ్‍ను రూప హత్య చేసిందని అనుమానిస్తారు. ఈ కేసును పోలీస్ ఆఫీసర్ రాజీవ్ (వంశీ కొటు) దర్యాప్తు చేస్తారు. ఈ క్రమంలో స్పందన, యుగ్ రామ్ మధ్య జరిగిన కొన్నిషాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఆసక్తికరమైన విషయాలు ఈ కేసు దర్యాప్తులో బయటికి వస్తాయి. మరి అజయ్‍ మృతి ప్రమాదమా..లేక హత్యనా? ఇన్విస్టిగేషన్ లో ఎలాంటి విషయాలు బయటికి వచ్చాయి? మర్డర్ మిస్టరీ ఏంటి? అనేదే ది ట్రయల్ సినిమా కథ. మరి క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్..ఇంకా లేట్ ఎందుకు చూసేయండి.