హీరో మోహన్ బాబు ఆస్థాన గేయ రచయిత కన్నుమూత.. ప్రముఖల సంతాపం

హీరో మోహన్ బాబు ఆస్థాన గేయ రచయిత కన్నుమూత.. ప్రముఖల సంతాపం

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ (77)  కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఇవాళ గురువారం (సెప్టెంబర్ 12న) ఉదయం మరణించారు.

గురుచరణ్ ప్రముఖ తెలుగు దిగ్గజ కవి ఆత్రేయ దగ్గర శిష్యరికం చేసి..తనదైన శైలిలో పాటలు రాసి మంచి గుర్తింపు పొందాడు. ఆయన రాసిన ఎన్నో విషాద గీతాలు తెలుగు సినిమా పరిశ్రమలో ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి. ఇక మోహన్ బాబు కోసం ప్రత్యేకంగా ఆయన పాటలు రాసేశారు. మోహన్ బాబు సైతం గురు చరణ్‌ను ప్రత్యేకంగా తన సినిమాలకు తీసుకుంటూ ఉండేవారు.

Also Read :- హీరో ధనుష్ పై రెడ్ కార్డ్ రద్దు

రచయిత గురుచరణ్ రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు. అందులో "ముద్దబంతి పువ్వులో మూగబాసలు", "కుంతీకుమారి తన కాలుజారి", "బోయవాని వేటుకు గాయపడిన కోయిలా" లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలును మోహన్ బాబుకు అందించారు. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు, పాటల ప్రేమికులు సొషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.