![Manchu Vishnu: ఇక సహించం..ఆ యూట్యూబర్లకు 48 గంటల డెడ్ లైన్..మంచు విష్ణు స్ట్రాంగ్ వార్నింగ్](https://static.v6velugu.com/uploads/2024/07/tollywood-maa-president-hero-manchu-vishnu-serious-warning-to-social-media-trollers_EUZKT6MD0a.jpg)
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంత పవర్ ఫుల్ గా ఎదుగుతుందో..అంతర్జాయతీయ సినీ మేకర్స్ కి కూడా తెలుసు. ఇక అంతే వేగంగా సినిమా వాళ్లపై అసభ్యకర వీడియోలు చేస్తూన్న సోషల్ మీడియా యూట్యూబర్స్ కూడా అంతే వేగంగా ఎదుగుతున్నారని టాలీవుడ్ హీరో, MAA (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ మంచు విష్ణు (Manchu Vishnu)అసహనం వ్యక్తం చేశారు.ఈ మేరకు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
"తెలుగు వాళ్లంటే చాలా పద్ధతిగా ఉంటారని ప్రపంచవ్యాప్తంగా అనుకుంటూ ఉంటారు.కానీ,ఈ మధ్య కాలంలో తెలుగు సోషల్ మీడియాలో ఆసభకరంగా ప్రవర్తించడం వల్ల..మొత్తం తెలుగు వాళ్ళందరినీ..ఇలా ఎందుకు చేస్తున్నారనే అనుకునే పరిస్థితి ఏర్పడిందని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.సాయిధరమ్ తేజ్ ఇటీవలే ప్రణీత్ హనుమంతు వీడియో మీద ఘాటుగా స్పందించిన వెంటనే రేవంత్ రెడ్డి సహా మిగతా ప్రభుత్వ పెద్దలంరూ రియాక్ట్ అయినందుకు చాలా థాంక్స్ చెబుతున్నాను. నిజానికి కూడా మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతను ఇంతలా తండ్రి కూతుళ్లపై అసభ్యకరంగా కామెడీ చేసి ఎందుకు ఆనందపడుతున్నారనేది నాకు అర్థం కాలేదు. అది చాలా పెద్ద తప్పు.అసలు మన తెలుగువాళ్ళం అలాంటి వాళ్ళం కాము.కానీ,కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చేసి పోస్ట్ చేసే వాళ్ల మీద సైబర్ సెక్యూరిటీ సెల్ కి ఫిర్యాదు చేస్తామని ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరు మార్చుకోవాలని మంచు విష్ణు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు,అసభ్యకరమైన వీడియోలు చేసే వారు ఇంతముందు చేసినవన్నీ 48 గంటల్లో వాటిని తొలిగించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు కోరారు. ఇక తన ఫోటోలను చెత్త మీమ్స్ కోసం సైతం వాడుకుంటున్నారని ప్రముఖ నటుడు బ్రహ్మానందం కూడా తనతో చెప్పినట్లు విష్ణు వెల్లడించారు.
ఇక అంతేకాకుండా ట్రోలింగ్ వీడియోలు చేసే వారికి,అసభ్యకరమైన వీడియోలు చేసే వారికి ఒక 48 గంటలు మాత్రమే టైం ఇస్తున్న.దయచేసి అలాంటి వీడియోలన్నీ తక్షణమే తొలగించండి. ఒకవేళ మీరు కనుక డిలేట్ చేయకపోతే సైబర్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేస్తాం.అలాగే మీ యూటూబ్స్ అన్నీ బ్యాన్ అయ్యేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.తెలంగాణ సీఎం రేవంత్ -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,ఏపీ సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ మేరకు మేము అప్పీల్ చేస్తున్నాం.సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలు చేసినా,డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ పెద్దలను కోరడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్స్ సైతం సపోర్ట్ చేస్తూ షేర్ చేస్తున్నారు.మరి డార్క్ కామెడీ పేరుతో చేసే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read : Malayalam Thriller OTT: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవలే ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి తండ్రీ కూతుళ్ళ బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ చాలా నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా డార్క్ హ్యూమర్ పేరుతో కామెంట్స్ (రాయలేని, చెప్పలేని) చెయ్యడం ఏమిటని మెజారిటీ జనాలు ప్రణీత్ హనుమంతు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేయాలని ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బుధవారం బెంగళూరు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి..పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించడం జరిగింది.