
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంపై జరిగిన ఉగ్రదాడి భారతీయులను ఆగ్రహావేశాలకు లోను చేస్తోంది. కశ్మీర్ పర్యటనకు వచ్చిన టూరిస్టులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీశారు. దాంతో ఒక్కసారిగా భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్ భయాందోళనలో బతుకుతుంది.
వేలాది మంది టూరిస్టులకు, సినిమా షూటింగ్ లకు ఈ పర్యాటక ప్రదేశమే (పహల్గాం) సెంటర్ పాయింట్. అంతేకాదు అక్కడీ స్థానికులకు ప్రధాన ఆదాయ వనరు కూడా పహల్గాం ప్రాంతమే. కానీ, ఇపుడు అవేం లేకుండా చేశారు ఉగ్రవాదులు.
ఇప్పటికే కాశ్మీర్ కు బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకుంటున్నారు టూరిస్టులు.ఇదే కాదు.. కాశ్మీర్ లోని హోటళ్లు,క్యాబ్ బుకింగ్ లు పెద్ద ఎత్తున రద్దు చేసుకుంటున్నారు. అలాగే, టాలీవుడ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి, ఎందుకంటే రాబోయే రెండు నెలల పాటు కాశ్మీర్‌లో జరగాల్సిన షూటింగులు రద్దు చేయబడ్డాయి.
ఇక్కడే పహల్గాం పరిసర ప్రాంతాల్లో తక్కవ బడ్జెట్తో, తెరకెక్కించాలనుకున్న చిన్న సినిమా మేకర్స్, తమ సినిమాలను రద్దు చేసుకున్నారు. అలాగే, ఓ పెద్ద హీరో సినిమా కూడా పోస్ట్ ఫోన్ చేసుకున్నట్లు సమాచారం. మరి ఫ్యూచర్లో ఇక్కడ సినిమాలు తెరకెక్కుతాయో లేదో అనే సందేహం నెలకొంది. చూడాలి మరి భవిష్యత్తు ఏం నిర్ణయిస్తుందో!
ఇదిలా ఉంటే.. ఎప్పటినుంచో.. ఇండియన్ సినీ మేకర్స్ తమ సినిమా షూటింగ్స్ కోసం పహల్గాం వెళుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అక్కడ చాలు సినిమాలు షూటింగ్స్ జరుపుకున్నాయి. ముఖ్యంగా మన టాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో చూసుకుంటే.. సీతా రామం, హిట్ 3, సరిలేరు నీకెవ్వరు, ఖుషి వంటి సినిమాలు కాశ్మీర్‌లో చిత్రీకరించబడ్డాయి.