Netflix Trending Movies: నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమాలు..

Netflix Trending Movies: నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమాలు..

ఈ ఏడాదిలో రిలీజ్ అయిన తెలుగు బడా బడ్జెట్ సినిమాలు దాదాపుగా హిట్ అయ్యాయి. అలాగే కమర్షియల్ గా కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక థియేటర్స్ లో అలరించిన సినిమాలు ఓటిటిలో కూడా అదరగొడుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ వైడ్ గా నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో టాప్ లో 10 లో అలరిస్తున్నాయి. 

దేవర : 

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. మాస్ & యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా దాదాపుగా రూ.675 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా నవంబర్ 8న ఓటిటిలోకి వచ్చింది. ప్రస్తుతం దేవర పార్ట్ 1 నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

లక్కీ భాస్కర్: 

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మొదటిసారిగా లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటించి టాలీవుడ్ కి ఫుల్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాని పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. ఈ సినిమా దీపావళి పండగ కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయ్యింది. థియేటర్స్ లో ప్యాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా రూ.125 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది . అలాగే నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

Also Read : 2024లో బిగ్ స్క్రీన్ పై కనిపించని తారలు వీళ్లే

హాయ్ నాన్న: 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న గత ఏడాది డిసెంబర్ 07న రిలీజ్ అయ్యింది. ఫాథర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో ప్రముఖ డైరెక్టర్ శౌర్యు తెరకెక్కించాడు. ఈ సినిమా మ్యూజికల్ గా కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. ప్రస్తుతం ఈ నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో4వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.