Tollywood New Movies: న్యూ ఇయర్ స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

Tollywood New Movies: న్యూ ఇయర్ స్పెషల్.. టాలీవుడ్ కొత్త సినిమాల పోస్టర్స్ రిలీజ్

కొత్త సంవత్సరం (2025) వేళ తెలుగు సినిమాల హంగామా మొదలైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తమ తమ సినిమాల పోస్టర్స్ తేలి చేసి అప్డేట్స్ ఇచ్చారు. మరి ఆ సినిమాలేంటీ? వాటి అప్డేట్స్ ఏంటనేది చూసేద్దాం. 

హరి హర వీరమల్లు:

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ 2025 మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా నుండి మొదటి సింగిల్ జనవరి 6, 2025న ఉదయం 9:06 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే, ఈ పాటని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారు. పెంచల్ దాస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి స్వరపరిచారు. 

Also Read : న్యూఇయర్ వేళ.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ అప్డేట్

డాకు మహారాజ్:

బాలకృష్ణ హీరోగా బాబీ రూపొందించిన చిత్రం ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్స్ లోకి రానుంది. మేకర్స్ న్యూ ఇయర్ విషెష్ చెబుతూ బాలకృష్ణ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. 

హిట్ 3 : ది థర్డ్ కేస్:

శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్ర సీక్వెల్స్ పై దృష్టి సారించాడు. ఈ క్రమంలో హిట్ 3 : ది థర్డ్ కేస్ ని తెరకెక్కిస్తున్నాడు. న్యూ ఇయర్ కానుకగా స్పెషల్‌ పోస్టర్‌ విడుదల చేశారు మేకర్స్. ఇందులో నాని సీరియస్‌ యాక్షన్‌ అవతార్‌లో కనిపించారు. ఈ మూవీ 2025 మే 1న రిలీజ్ కానుంది. ఇదివరకే టీజర్ విడుదల కాగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇడ్లీ కడై:

ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు దర్శకుడిగానూ బిజీ అవుతున్నాడు ధనుష్​. రీసెంట్‌‌‌‌గా ‘రాయన్’చిత్రాన్ని డైరెక్ట్ చేసి, హీరోగానూ సక్సెస్ అందుకున్న ధనుష్.. మరో  సినిమాలో కూడా లీడ్‌‌‌‌గా చేస్తూనే, దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించాడు.

ఇప్పటికే ఈ మూవీ కాన్సెప్ట్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు టైటిల్‌‌‌‌ను రివీల్ చేశారు.‘ఇడ్లీ కడై’ టైటిల్‌‌‌‌తో రూపొందించనున్నట్టు ప్రకటించారు. ఇపుడు న్యూ ఇయర్ స్పెషల్ గా ధనుష్ సాదాసీదాగా కనిపిస్తూ ఓ చేతిలో సంచి, మరో చేతిలో టిఫిన్ బాక్సులు పట్టుకుని వెళుతున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది.