ఆ సినిమాతో భారీగా నష్టపోయా.. అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవర్ అయ్యాను

ఆ సినిమాతో భారీగా నష్టపోయా..  అల్లు అర్జున్ ఆర్య సినిమాతో రికవర్ అయ్యాను

ప్రముఖ స్టార్ హీరో నితిన్ హీరోగా నటించిన దిల్ చిత్రం మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ వెలమకుచ వెంకట రమణా రెడ్డి నిర్మాతగా కెరీర్ ని మొదలు పెట్టారు. అయితే దిల్ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమా పేరుని తన స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు దిల్ రాజు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు సినీ ఇండస్ట్రీలో తాను కొన్న సినిమాలతో నష్టపోయి మళ్ళీ రికవర్ అయిన సందర్భాల గురించి స్పందించారు. 

ఈ క్రమంలో 2004 సంవత్సరంలో ప్రముఖ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో వచ్చిన జై చిత్రాన్ని రూ.2.25 కోట్లు పెట్టి కొన్నామని కానీ ఈ చిత్రంవల్ల దాదాపుగా రూ.2 కోట్లు నష్టం వచ్చిందని తెలిపాడు. కెరీర్ ప్రారంభిస్తున్న సమయంలో తనకి ఇది చాలా పెద్ద నష్టమని అన్నారు. 

కానీ అదే ఏడాది తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన ఆర్య సినిమాకి పెద్ద హిట్ అవ్వడంతో మంచి ప్రాఫిట్స్ వచ్చాయని దీంతో జై సినిమా నష్టాల నుంచి బయటపడినట్లు తెలిపారు. అయితే సినిమా ఇండస్ట్రీలో లాభనష్టాలనేవి కామన్ అని ఇందులో ఒక్క సినిమాలో ప్రాఫిట్స్ వస్తే ఇంకో సినిమాతో నష్టం రావచ్చని కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళితేనే ఇండస్ట్రీలో లైఫ్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ALSO READ | క్రేజీ లుక్ లో మహేష్.. డెవిల్ లుక్ అదిరింది..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు తెలుగులో గేమ్ చేంజర్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో గేమ్ చేంజర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.