దుబాయ్ ఈవెంట్‌లో గుండెపోటుతో టాలీవుడ్ నిర్మాత మృతి..

దుబాయ్ ఈవెంట్‌లో గుండెపోటుతో టాలీవుడ్ నిర్మాత మృతి..

టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో గుండెపోటుతో మృతి చెందారు. దుబాయ్ జరుగుతున్న ఓ ఈవెంట్ కి హాజరైన కేదార్ అక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కేదార్ మరణం గురించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కేదార్ ఆనంద్ దేవరకొండ హీరోగా గం గం గణేశా సినిమాను నిర్మించారు. కేదార్ మరణవార్త తెలుసుకున్న ఆయన మిత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేదార్ సన్నిహితుడని తెలుస్తోంది. అంతే కాకుండా హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత బన్నీ వాసులకు కేదార్ సన్నిహితుడని సమాచారం. 

గం గం గణేశా సహా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు కేదార్‌. గతంలో రాడిసన్ హోటల్‌లో డ్రగ్ పార్టీలో దొరికారు కేదార్. కేదార్ గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించిన అధికారులు. కేదార్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.