కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ నిర్మాత నాగవంశీ ఫైర్..

కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారంటూ నిర్మాత నాగవంశీ ఫైర్..

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలోని పలు అంశాలపై ఇంటర్వ్యూలు, పాడ్కాస్ట్లలో స్పందిస్తున్నాడు.  ఈ క్రమంలో మొన్నటికిమొన్న సినిమా టికెట్ల రేట్ల పెంపుపై స్పందించి ఒక్కసారిగా వైరల్ అయ్యాడు. అయితే ఇటీవలే సినిమాలపై నెగిటివ్ రివ్యూలు ఇచ్చేవారిపై నాగవంశీ ఫైర్ అయ్యారు.

ఇందులోభాగంగా కొందరు సినిమాలు బాగున్నప్పటికీ కావాలనే వ్యూస్ కోసం నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని ఇది సరికాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే భవిష్యత్ లో పెద్ద సినిమాలకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వరేమో అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమందయితే  ఏకంగా సినిమాని సినిమాలాగా చూడకుండా అందులోని లోటుపాట్లని వెతుకుతుంటారని, ఇలాంటివారు ఇచ్చే రివ్యూల కారణంగా ఆడియన్స్ అనవసరంగా డైవర్ట్ అవుతుంటారని ఫైర్ అయ్యారు.

ALSO READ : ఓటీటీలోకి రాబోతున్న కార్తీ సత్యం సుందరం..

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నాగవంశీ టాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రాలకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇందులో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం టైటిల్ మరియు రిలీజ్ డేట్ ని దీపావళి సందర్భంగా తెలియజేస్తామని నిర్మాత నాగవంశీ తెలిపారు.