3 గంటల సినిమా కోసం రూ.1500 పెట్టలేరా..?: నిర్మాత నాగవంశీ

3 గంటల సినిమా కోసం రూ.1500 పెట్టలేరా..?: నిర్మాత నాగవంశీ

పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు బడ్జెట్ ని బట్టి సినిమాల టికెట్ రేట్లు పెంచుతుంటారు. ఈ క్రమంలో బడ్జెట్ మరియు ఖర్చులనిబట్టి ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపుకి అనుమతులు ఇస్తుంటుంది. దీంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతారనే వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత నాగవంశీ ఈ విషయంపై స్పందించారు. 

ఇందులో భాగంగా సింగిల్ స్క్రీన్ లో పెద్ద బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లు రూ.250 ఉంటాయని ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు కలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్ కి సినిమా చూడటానికి వెళ్తే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ తో కలిపి రూ.1500 అవుతుందని దీంతో 3 గంటలపాటూ వినోదాన్ని ఎంజాయ్ చేయవచ్చని అన్నారు. 

ALSO READ | నాగబంధం మూవీ ని లాంచ్ చేసిన మెగాస్టార్...

అలాగే ఏపీ, తెలంగాణ, యూఎస్ లో ఎక్కడా రూ.1500కి 3 గంటల పాటూ మొత్తం ఫ్యామిలీకి వినోదం దొరకదని, సినిమా అనేది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫ్లాట్ఫారం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక బడ్జెట్, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంవల్లే టికెట్ రేట్లు రీజనబుల్ గా పెంచుతున్నామని స్పష్టం చేశారు. టికెట్ రేట్లపై నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ విషయం ఇలా ఉండగా  ఇటీవలే నిర్మాత నాగవంశీ తెలుగులో ప్రముఖ హీరో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రానికి డిస్ట్రీబ్యూటర్ గా వ్యవహరించారు. కాగా దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతోపాటూ దాదాపుగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పూర్తీ చేసుకుని లాభాల్లోకి అడుగుపెట్టింది.