భూ ఆక్రమణ కేసులో ప్రముఖ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ మళ్ళీ అరెస్ట్..

భూ ఆక్రమణ కేసులో ప్రముఖ ప్రొడ్యూసర్ శివరామకృష్ణ మళ్ళీ అరెస్ట్..

తెలుగు ప్రముఖ సినీ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు అనారోగ్య సమస్యలు కారణంగా బెయిల్ మంజూరు చెయ్యాలని శివరామకృష్ణ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇటీవలే పోలీసులు మరోసారి శివరామకృష్ణ బెయిల్ పిటీషన్ ని పునః పరిశీలించాలని కోర్టుని కోరడంతో శివరామకృష్ణ బెయిల్ ని కోర్టు కొట్టి వేసింది. దీంతో గురువారం(అక్ర్టోబర్ 24) నిర్మాత శివరామకృష్ణ ని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ALSO READ | బ్రేకింగ్ : కొరియోగ్రాఫర్ జానీకి బెయిల్ మంజూరు

అయితే నిర్మాత శివరామకృష్ణ హైదరాబాద్ లోని రాయదుర్గం పరిసర ప్రాంతంలో ఉన్న 84 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించాలని  పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్న ఓ ఉద్యోగి నుంచి ల్యాండ్ సంబంధిత డాక్యుమెంట్లు తెప్పించి వాటికి డూప్లికేట్ చేసి భూమిని సొంతం చేసుకోవాలని  ప్రయత్నాలు చేస్తున్నాడు.  దీంతో పోలీసులు  శివరామకృష్ణపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా నిర్మాత శివరామకృష్ణ తెలుగులో దరువు (రవితేజ), ప్రేమంటే ఇదేరా(వెంకటేష్) తదితర చిత్రాలతోపాటూ మరో 8 చిత్రాలకి నిర్మించారు.