పుష్ప రాజ్ బాటలోనే రామ్ చరణ్... ఇండియా వైడ్ గా అలా చేయబోతున్నాడా..?

పుష్ప రాజ్ బాటలోనే రామ్ చరణ్... ఇండియా వైడ్ గా అలా చేయబోతున్నాడా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత ప్రమోషన్స్ షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రమంలో పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ ఫార్ములా నే ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై మరియు ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించి గేమ్ ఛేంజర్ సినిమాని ప్రమోట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మొదటగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించి ఇందులోనే ట్రైలర్ రిలీజ్ చెయ్యనున్నట్లు టాలీవుడ్ సినీవర్గాల సమాచారం. అయితే ఇటీవలే అమెరికాలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించడంతో లోకల్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఎక్స్పెటేషన్స్ పెట్టుకున్నారు. త్వరలోనే ఈ ప్రమోషన్స్ ఈవెంట్స్ గురించి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా గేమ్ ఛేంజర్ వచ్చే ఎడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో తెలుగుతోపాటూ హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళం తదితర ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుంచి రిలీజ్ అయిన పాటలు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.