మెగాస్టార్ చిరంజీవికి డబ్బింగ్ చెప్పిన సీనియర్ నటుడు మృతి.

మెగాస్టార్ చిరంజీవికి డబ్బింగ్ చెప్పిన సీనియర్ నటుడు మృతి.

కోలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్ సోమవారం రోజున మరణించాడు. ఈ విషయాన్ని  ఢిల్లీ గణేష్ కుటుంబ సభ్యులు, స్నేహితులు సోషల్ మీడియా వేదికగా అభిమనులకి తెలియజేశారు. అయితే గణేష్ గత కొద్దికాలంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. 

దీంతో ఇటీవలే హాస్పిటల్ లో చేరి చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. కానీ ఏమైందోఏమోగాని ఈరోజు ఉదయం రామాపురం(చెన్నై) లోని తన స్వంత నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు  ఢిల్లీ గణేష్ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ సంతాపం తెలియజేస్తున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా నటుడు  ఢిల్లీ గణేష్ తెలుగు, తమిళ్, మలయాళం తడితహర భాషలలో దాదాపుగా 2 వందలకి పైగా సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో అన్న, తమ్ముడు, తండ్రి తదితర పాత్రలు పోషించి అలరించాడు. అలాగే పలు సీరియల్స్ లో నటించి బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా కొంతకాలం పని చేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి (47 నాత్కల్, కాదల్ దేవతై), విష్ణువర్ధన్ (కన్నడ), తదితరులతోపాటూ మరింతమందికి డబ్బింగ్ చెప్పారు.  ఇక చివరగా విలక్షణ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమాలో చిన్నపాత్రలో కలనిపించాడు.