ఆర్టిస్ట్ ని అనాథగా వదిలేస్తారా అంటూ సాయం కోసం ఎదురు చూస్తున్న నటి శ్యామల..

టాలీవుడ్ ప్రముఖ సీఈనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి శ్యామల కొన్నేళ్లుగా ఆర్ధిక, అనారోగ్య సమస్యలతో బాధ పధాతున్నారు. దీంతో ఇప్పటికే చిరంజీవి పలుమార్లు ఆర్థికసాయం అందించారు. అయితే శ్యామల కూతురు కూడా అనారోగ్యంతో ఇబ్బందిపడుతోంది. ఈ క్రమంలో ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు లేక శ్యామల ఆర్ధిక సాయం కోసం ఎదురు చూస్తోంది. 

అయితే తమ బంధువుల ద్వారా నటి శ్యామల ఆర్థిక సాయం అర్థిస్తూ ఓ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో తాను 50 ఏళ్లుగా ఆర్టిస్ట్ గా కష్టపడుతూ బ్రతికానని కానీ గత 3 ఏళ్లుగా ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నానని తెలిపింది. తాను గతంలో చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు తదితర స్టార్ హీరోల సినిమాల్లో నటించానని ప్రస్తుతం తాను, తన కూతరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చెప్పుకొచ్చింది. 

అలాగే గతంలో తమ ఆర్థిక కష్టాల గురించి చాలా ఇంటర్వ్యూలలో చేపినప్పటికీ ఎవరూ స్పందించలేదని కనీసం ఇప్పటికైనా స్పందించి సహాయం చెయ్యాలని విన్నవించింది. అలాగే ప్రస్తుతం విషం తగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నానని కాబట్టి దయ తలచి సాయం చెయ్యాలని అర్థించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఈ విషయం ఇలా ఉండగా నటి శ్యామల తెలుగులో దాదాపుగా 300 కి పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన గోలీమార్ సినిమాలో చేసిన పనిమనిషి క్యారెక్టర్ ఇప్పటికే మనకి మీమ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు కామెడీ పాత్రల్లో నటించి నవ్వించిన నటి శ్యామల ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో కొందరు అయ్యో పాపం అంటున్నారు. మరికొందరు మాత్రం సీనియర్ ఆర్టిస్ట్ ని ఆదుకోవాలని సినీ పెద్దలకి సూచిస్తున్నారు.