టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ శరత్ కన్నుమూత

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ డైరెక్టర్ శరత్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న శరత్.. ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. దీంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. రేపు 11 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ‘చాదస్తపు మొగుడు’ మూవీతో తెలుగు పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన శరత్.. దాదాపు 20 చిత్రాలకు డైరెక్షన్ చేశారు. ముఖ్యంగా సుమన్, బాలకృష్ణతో ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. బాలయ్యతో పెద్దన్నయ్య, పెద్దింటి అల్లుడు, వంశోద్ధారకుడు లాంటి హిట్ సినిమాలను తెరకెక్కించారు. 

మరిన్ని వార్తల కోసం:

పరీక్షలను పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలె

నిన్న శిలాఫలకమేస్తే.. నేడు కూలగొట్టిన్రు

మనసుకి హాయినిచ్చే ఎత్తిపోతల