సీనియర్ నటి సుహాసిని(Suhasini) తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ప్రస్తావించారు. ఓ సినిమా కోసం హీరో ఒడిలో కూర్చోవాలని.. అతను ఎంగిలి చేసిన ఐస్క్రీం తినాలని నాపై ఒత్తిడి చేశారు. ఇండియాలో ఇలాంటివి చేయరు. ఆ ఐస్క్రీంను మార్చండి లేదంటే నేను ఈ సీన్ చేయనని చెప్పాను. అక్కడున్న వారు షాకయ్యారు.
నా సహనటి శోభనకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో ఆమె కొన్ని సీన్లకు అభ్యంతరం చెప్పింది. దీంతో నువ్వేమైనా సుహాసినివి అనుకుంటున్నావా చేయనని చెప్పడానికి అని గద్ధించారట. దీంతో ఆమె వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పింది. నచ్చని సీన్లు సుహాసిని చేయదు అనే స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ రీచ్ అయ్యిందని అప్పుడే తెలిసిందని.. నటి సుహాసిని తెలిపారు.
టాలీవుడ్ లో సుహాసిని అనగానే..అందరికీ ఒక హోమ్లీ హీరోయిన్ గుర్తుకొస్తారు. తన కెరీర్ లో హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె.. ఎప్పుడు కూడా గ్లామర్ షో గానీ, హద్దులు మీరిన డ్రెస్సింగ్ తో గానీ ఎక్కడ కనిపించలేదు. తనకున్న గుడ్ క్వాలిటీస్ లో ముఖ్యంగా వస్త్రధారణ అని చెప్పుకోవొచ్చు. హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోగా..ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ లో నటిస్తూ బిజీగా అంది.