క్యాన్సర్ తో టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మృతి..

క్యాన్సర్ తో టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు మృతి..

టాలీవుడ్ ప్రముఖ సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది అనారోగ్యంతో కన్నుమూసింది. అపర్ణ గత కొన్నేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దీంతో అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో పలు రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. అయినప్పటికీ క్యాన్సర్ అదుపు కాకపోవడంతో తీవ్ర మానసిక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. 

అయితే ఇటీవలే అపర్ణ మల్లాది తీవ్ర అస్వస్థతకి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ  గురువారం సాయంత్రం కన్ను మూసింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా అపర్ణ మల్లాది తెలుగులో 2013లో వచ్చిన ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. ఈ సినిమా తర్వాత 2022లో వచ్చిన పెళ్లి కూతురు పార్టీ అనే  సినిమాకి స్క్రిప్ట్ రైటర్ గా, దర్శకురాలిగా పని చేసింది.  గతంలో యూట్యూబ్ లో పోష్ పోరీస్ అనే వెబ్ సీరీస్ ని డైరెక్ట్ చేసింది. కానీ అప్పటికే క్యాన్సర్ తీవ్రత ఎక్కువవడంతో ట్రీట్మెంట్ కి అమెరికా వెళ్ళింది. ఎంతో మంచి టాలెంట్ ఉన్నటువంటి దర్శకురాలు 54 ఏళ్ళ వయసులోనే కన్ను మూసింది.