Tollywood Singers Wedding: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యువ టాప్ సింగర్స్.. ఫోటోలు వైరల్!

Tollywood Singers Wedding: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యువ టాప్ సింగర్స్.. ఫోటోలు వైరల్!

తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్స్ అనురాగ్ కులకర్ణి (Anurag Kulakarni), మెలోడీ క్వీన్ రమ్య బెహరా (Ramya Behara) ఎంతో సుపరిచితం. వీరి ప్రత్యేకమైన స్వరానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇపుడీ ఈ ప్రముఖ సింగర్స్ 'అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా' సీక్రెట్గా పెళ్ళిచేసుకుని సడెన్ షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'ఇది నిజంగానే ఒరిజినల్ ఫొటోయేనా..? లేదా ఎడిట్ ఫోటోనా? అనే సందేహం కూడా కలిగిస్తోంది' అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ నిజంగానే వీరి పెళ్లి జరిగితే.. అతిథులుగా టాలీవుడ్ సింగర్స్ ఎవరైనా వెళ్ళారా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

ఇకపోతే  వీరిద్దరిది ప్రేమ వివాహామని తెలుస్తోంది. కాగా వీరి పెళ్ళి ఎప్పుడు.. ఎక్కడ జరిగిందనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. ఇటీవలే వీరిద్దరూ కలిసి అమరన్ సినిమాలో పాడిన 'హే రంగులే' సాంగ్ ప్రస్తుతం శ్రోతలను అలరిస్తోంది.  

అనురాగ్ కులకర్ణి టాలీవుడ్లో బిజీయెస్ట్ సింగర్ గా మారాడు. కంచరపాలెం సినిమాలో 'ఆశా పాశం' అనే సాంగ్తో ఎంతో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వచ్చిన ‘ఆర్ఎక్స్ 100’ లో పిల్లారా సాంగ్ పాడి యూత్లో ఓ స్పెషల్ క్రేజీ సొంతం చేసుకున్నాడు. ఇక అక్కడినుంచి వెనక్కి చూసుకోకుండా వరుస సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా మారారు.

రమ్య బెహరా విషయానికి వస్తే.. సంగీత దిగ్గజం కీరవాణీ ఆమెను టాలీవుడ్ కు పరిచయం చేశారు. టెంపర్, ఒక లైలా కోసం, ఇస్మార్ట్ శంకర్, రెడ్, రంగ్ దే, శతమానం భవతి, బాహుబలి లాంటి సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. ప్రస్తుతం రమ్య బెహరా వరుస సినిమాల్లో పాటలు పాడుతూ రాణిస్తోంది.