
టాలీవుడ్ సీనియర్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. అసలు ఒక స్టార్ సింగర్ ఇలా సడెన్ గా సూసైడ్ డెసిషన్ తీసుకోవడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతుంది. తాను ఇలా ఒంటరిగా మారి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనుక ఎంతో కొంత వెలితి ఉండే ఉంటుందనే అనుకుంటున్నారు. ఈ క్రమంలో సింగర్ కల్పన భర్త, ఫ్యామిలీ వివరాలపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
సింగర్ కల్పనా వ్యక్తిగత జీవితం:
సింగర్ కల్పనా రాఘవేంద్ర సంగీత కుటుంబంలోనే జన్మించారు. తండ్రి టి.యస్. రాఘవేంద్ర. అతను ప్రముఖ నేపథ్య గాయకుడు, ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమె తమ్ముడు షికినా షాన్ ఒక ఒపెరా సింగర్.
Also Read:-సింగర్ కల్పన హెల్త్ బులిటెన్.. స్టమక్ వాష్ చేసి..
కల్పనా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని పూర్తి చేసింది. మధురై టి. శ్రీనివాసన్ దగ్గర సింగర్ గా శిక్షణ తీసుకుంది. ఐదేళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావుచే కూర్చిన `కుటుంబం` సినిమాలో పాట కోసం గాత్రాన్ని ఇచ్చింది. అప్పట్నుంచి గాయనిగా రాణిస్తూనే ఉంది. ఎన్నో వేల షోస్ చేసింది. ఇలా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 1500కి పైగా పాటలు పాడింది. 3000కు పైగా షోలు చేసింది.
సింగర్ కల్పనా భర్త:
కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్. అతను వ్యాపారవేత్త. ఆయన చెన్నైలోనే ఉంటున్నారని సమాచారం. అయితే, తన 19ఏళ్ల కూతురుని ఆయనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె స్టడీస్ కూడా ఆయనే భరిస్తున్నాడట. అయితే ప్రసాద్‌కి కల్పన సింగర్‌గా ఎదగడం నచ్చకపోవడం వల్లే వీరి మధ్య గ్యాప్ కి కారణమని తెలుస్తోంది.
అయితే, మంగళవారం రాత్రి (మార్చి 4న) కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సంఘటనలో కల్పన భర్త ప్రసాద్ ని ఇప్పటికే హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అసలు నిజాలు తెలుస్తున్నట్లు అర్ధమవుతుంది.
రోజూ వేసుకునే జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రల్ని ఎక్కువ మోతాదులో వేసుకున్నారని, మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేయగా.. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి ప్రసాద్ కాల్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించగా.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. ఇకపోతే కల్పన కోలుకున్నాక.. ఆమెను పోలీసులు విచారించిన తర్వాతే అసలు నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది.
కల్పనా రాఘవేంద్ర ఎవరు?
కల్పనా రాఘవేందర్ సంగీత ప్రయాణం ఐదు సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది. నేపథ్య గాయనిగా ఉంటూనే పాటల రచయిత్రి మరియు నటిగా కూడా మారింది. బాలనటిగా ముప్పైకి పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది. కెరీర్ తొలినాళ్లలో మలయాళంలో ఐడియా స్టార్ సింగర్ గెలిచిన తర్వాత ఆమె విస్తృత స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఎన్నో వేల షోస్ చేసింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 1500కి పైగా పాటలు పాడింది. 3000కు పైగా షోలు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొంది. కానీ తొలివారమే ఎలిమినేట్ అయిపోయింది. అంతేకాకుండా ఆమె సూపర్ సింగర్ జూనియర్లో న్యాయనిర్ణేతగా కూడా ఉంది. యువ గాయకులకు మార్గదర్శకత్వం వహిస్తుంది.