
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన హెల్త్ బులిటెన్ను వైద్యులు విడుదల చేశారు. ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశామని డాక్టర్లు తెలిపారు. సింగర్ కల్పన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంగళవారం రాత్రి ఆసుపత్రికి తరలించగానే కల్పనకు వైద్యులు స్టమక్ వాష్ చేశారు. లంగ్స్లో వాటర్ చేరడంతో వెంటిలేటర్ అవసరం అయింది.
వెంటిలేటర్ నుంచి ప్రస్తుతం బయటకు వచ్చారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని, అందువల్ల ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం ఉందని చెప్పారు. ఆమె స్లీపింగ్ ట్యాబ్లెట్స్ తీసుకుందని, డిప్రెషన్లో వాడే నిద్ర మాత్రలే ఆమె మింగినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
ఆమె ప్రస్తుత పరిస్థితిపై హాలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ చైతన్య మాట్లాడుతూ.. నిన్న సాయంత్రం(మంగళవారం) 5:30కి అపస్మారక స్థితిలో ఆమెను హాస్పిటల్కు తీసుకు వచ్చారని తెలిపారు. నిద్ర మాత్రలు ఎక్కువ తీసుకున్నారని చెప్పారని, మాత్రల డోస్ ఎక్కువ అవ్వడంతో స్టమక్ వాష్ చేశామని ఆయన వివరించారు.
బ్రీత్ సమస్యలకు పరీక్షలు చేశామని, పలమనరి సమస్యకు చికిత్స అందించామని డాక్టర్ చైతన్య చెప్పారు. అత్యవసర పరిస్థితిలో 12 గంటలు వెంటిలేటర్ పెట్టామని, ప్రస్తుతం వెంటిలేటర్ తీసేశామని తెలిపారు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని, ఆ సమస్యను క్లియర్ చేస్తామని హాలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ చైతన్య కల్పన ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరించారు.
Also Read:-హెల్త్ అప్డేట్.. నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం..
నిజాంపేట రోడ్లోని విల్లాలో నివాసం ఉంటున్న కల్పన రెండు రోజులుగా బయటకు రాలేదు. దీంతో చుట్టుపక్కల వాళ్లు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. లోపల బెడ్ రూంలో అచేతనంగా పడి ఉన్న కల్పనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పనను ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. నిద్ర మాత్రలు ఓవర్ డోస్ కారణంగానే కల్పన స్పృహ కోల్పోయినట్లు అనుమానిస్తున్నారు.
కల్పనకు రోజూ నిద్రమాత్రలు వాడే అలవాటు ఉందని ఆమె భర్త ప్రభాకర్ పోలీసులకు తెలిపారు. రెండు రోజులుగా తాను చెన్నైలో ఉన్నానని, నిద్ర మాత్రలు ఓవర్ డోస్ అయిందని కల్పన ఫోన్ చేసి చెప్పిందని వివరించారు. దీంతో తాను చుట్టుపక్కల వాళ్లకి ఫోన్ చేసి సాయం అర్థించినట్లు తెలిపారు. కాగా, భర్తతో విడాకులు తీసుకున్న సింగర్ కల్పన బిజినెస్ మ్యాన్ ప్రసాద్ ప్రభాకర్ను రెండో పెళ్లి చేసుకుంది. చెన్నైలో డెంటల్ సంబంధిత పార్ట్స్ బిజినెస్ చేస్తుంటారు.