Singer Kalpana: హెల్త్ అప్డేట్.. నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం

Singer Kalpana: హెల్త్ అప్డేట్..  నిలకడగా సింగర్ కల్పన ఆరోగ్యం

ప్రముఖ టాలీవుడ్ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి (మార్చి 4న) కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్‌ ఆసుపత్రిలో చేరిన గాయని కల్పనకు చికిత్స కొనసాగుతోంది.

ప్రస్తుతం కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆమెను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కట్టారు.

ALSO READ : సింగర్ కల్పన అప్డేట్ : రెండ్రోజులు ఉలుకూపలుకూ లేకుండా ఉండటానికి కారణం తెలిసింది !

ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సునీత, గీతామాధురి, శ్రీకృష్ణ తదితరులు అక్కడికి చేరుకొని ఆమె ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.

అసలేమైందంటే:

సింగర్ కల్పన (మార్చి 4న) ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. నిద్రమాత్రలు మింగి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నిజాంపేట్‎లోని ఓ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటోన్న కల్పన.. గత రెండు రోజులుగా ఇంటి డోర్ తీయకపోవడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

కల్పన ఇంటికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమె అపార్ట్‎మెంట్ తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పోలీసులు హుటాహుటిన సింగర్ కల్పనను నిజాంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి  తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది.