హైదరాబాద్ : మొబైల్ ఫోన్లను అమ్మే సెల్‌బే శుక్రవారం తమ గచ్చిబౌలి షోరూమ్‌లో షావోమి లేటెస్ట్ మోడల్ రెడ్‌మీ నోట్14 సిరీస్‌ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ చేతులమీదుగా లాంచ్ చేసింది. ఈ సందర్బంగా మంగ్లీ మాట్లాడుతూ ..తెలంగాణలో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్‌బే షోరూమ్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఉత్తమమైన ప్రొడక్ట్స్, సర్వీసెస్ అందిస్తున్న సంస్థ మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. తమ సంస్థ ఎల్లప్పుడూ కస్టమర్స్‌కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని, అందులో భాగంగా శుక్రవారం రెడ్‌మీ నోట్14 సిరీస్ లాంచ్ చేశామని సెల్‌బే ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.