Mad 2: స్టార్ హీరోతో మ్యాడ్ 2.. ఆయనతో వర్కౌట్ అవుతుందా!

అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మ్యాడ్(Mad). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్(Narne Nithin) హీరోగా ఎంట్రీ ఇవ్వగా సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin), శ్రీ గౌరీ ప్రియా(Srigouri priya), అనంతిక(Ananthika) ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబట్టింది. 

కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కాలేజ్ లైఫ్, అక్కడ ఉండే అల్లరి, హాస్టల్ డేస్ ను ఫన్నీ వేలో ప్రెజెంట్ చేసిన ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంతో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. దీంతో ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అయితే.. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు మ్యాడ్ సినిమాకు సీక్వెల్ రానుందట. మ్యాడ్ 2 పేరుతో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన కథ చర్చలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని టాక్. 

ALSO READ :- సిరిసిల్లలో పోటీ చేద్దాం.. నేను గెలిస్తే నీ పార్టీ మూసుకుంటవా.?: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ డోస్ ను మరింత పెంచనున్నారట. అందుకోసం ఓ స్టార్ హీరోను ఈ సినిమాలోకి తీసుకోనున్నారట మేకర్స్. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. అవును మ్యాడ్ సీక్వెల్ లో శర్వానంద్ కీ రోల్ చేయనున్నాడట. ఆ పాత్ర చుట్టూనే ఈ సీక్వెల్ తీరుతుందని సమాచారం. అంతేకాదు.. ఆ పాత్ర ఎంటర్ అయినప్పటినుండి కామెడీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మరి స్టార్ హీరో కాంబోలో వస్తున్న మ్యాడ్ సీక్వెల్ ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.