జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బాధితురాలికి అండగా స్టార్ హీరో.

జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బాధితురాలికి అండగా స్టార్ హీరో.

సినీ కొరియోగ్రాఫర్ జానీ లైంగిక వేధింపుల కేసు వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు బాధితురాలికి మద్దతుగా నిలబడుతున్నారు. ఫిలిం ఛాంబర్‌ ప్యానల్ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. 

ఇందులోభాగంగా ప్రముఖ నటి ఝాన్సీ మాట్లాడుతూ.. కొరియోగ్రాఫర్ జానీ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారామె. బాధితురాలిని కలసి ఆమెతో మాట్లాడటమే కాకుండా.. ఓ టాప్ హీరో సినిమాలో అవకాశం కూడా వచ్చిందని చెప్పుకొచ్చింది.

అలాగే సదురు హీరో తన తన మేనేజర్ ద్వారా భాదితురాలికి అండగా ఉంటానని హామీ ఇచ్చడని వెల్లడించారామె. టాలెంట్ ఉన్న అమ్మాయిలని గుర్తించడంతోపాటూ ఇండస్ట్రీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని ప్రెస్ మీట్ లో వెల్లడించారు ఝాన్సీ.


అయితే ఈ లైంగిక వేధింపుల వ్యవహారంలో ఇబ్బంది పడుతున్న భాదితురాలికి సపోర్ట్ చేసింది ప్రముఖ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు బలంగా వినిపిస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్ ఓ సినిమా ఈవెంట్ మాట్లాడుతూ.. టాలెంట్ ఉన్న అమ్మాయిలకి ఎప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ మాటలకు.. ఇప్పుడు ఝాన్సీ మాట్లాడిన మాటలకు మ్యాచ్ అవుతున్నాయని.. అప్పట్లో అల్లు అర్జున్ ఏ విధంగా అయితే చెప్పారో.. అలాంటి మాటలే ఇప్పుడు ఝాన్సీ నోటి నుంచి వచ్చాయనేది నెటిజన్లు వెర్షన్. కొరియోగ్రాఫర్ జానీ బాధితురాలికి అండగా ఉన్నది.. అవకాశం ఇచ్చిన టాప్ హీరో అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియా అందరి ఫ్యాన్స్ ఒపీనియన్ గా ఉంది.