విజయ్ దేవరకొండ ‘హోమ్‌టౌన్’ ట్రైలర్‌ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే.?

విజయ్ దేవరకొండ ‘హోమ్‌టౌన్’ ట్రైలర్‌ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే.?

టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ మంగళవారం ‘హోమ్‌టౌన్’ వెబ్ సిరీస్ టైలర్ ని రిలీజ్ చేశాడు. ఈ వెబ్ సీరీస్ ని నోస్టాల్జియా   మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించగా  రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, అన్నీ, సాయిరామ్, అనిరుధ్ మరియు శ్రావ్య తదితరులు నటించారు. ఇపుడు ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ విశేషాలేంటో చూద్దాం.

రాజీవ్ కనకాల చిన్నపాటి ఫోటో స్టూడియోని నడుపుతూ ఫ్యామిలీని రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో తనకొచ్చే ఆదాయంతోనే తన పిల్లలని  బాగా చదివించి ఫారెన్ కి పంపించాలని అనుకుంటాడు. కానీ రాజీవ్ కొడుకు శ్రీకాంత్ మాత్రం తనకి చదువు పెద్దగా ఎక్కడం లేదని ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఈ విషయం తన తండ్రికి చెప్పడంతో కొన్ని ఫ్యామిలీ డ్రామా సీన్స్ తర్వాత శ్రీకాంత్ ఫారెన్ కి వెళ్లి చదువుకోవడానికి ఓకే చెబుతాడు.. చివరికి ఏమైందని విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 4 వరకూ ఆగాల్సిందే.. 

ALSO READ | అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా స్టోరీ లీక్ చేసిన ప్రొడ్యూసర్.. మరో ఇండస్ట్రీ హిట్ తప్పదా..?

మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యిందని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఒటిటి ఆహాలో ప్రసారం కానుంది.